22, జులై 2015, బుధవారం

మనసంతా గోదావరి

నిలిచెనే గోదారీ....  మనసునే ముంచేసీ
పట్టెనే గోదారీ....   వయసునే వల వేసీ

పరుగిడే గోదారీ....  పరువమే కలబోసీ
పలికేనే గోదారీ ....  మాటలే కలిపేసీ

చూసెనే గోదారీ .... కనులలో ముడి వేసీ
ముద్దుగా గోదారీ .... వంపులా సొంపేసీ

కాలమే గోదారీ .... పరుగిడే నిను చూసీ 
గుండెలే గోదారీ .... అదిరెనే నిను చూసీ